కేంద్రం కీలక నిర్ణయం..రెండు సంస్థలకు ఆమె పేరు

నేడు సుష్మస్వరాజ్ 68వ జయంతి..గతేడాది ఆగస్టు 6న కన్నుమూత

Sushma Swaraj
Sushma Swaraj

న్యూఢిల్లీ: నేడు బిజెపి అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మ స్వరాజ్‌ 68 జయంతి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రం, ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు గురువారం కేంద్రం సుష్మ స్వరాజ్ పేరు పెట్టింది. ప్రవాస భారతీయ కేంద్రానికి ఖసుష్మా స్వరాజ్‌ భవన్‌గగా, ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఖసుష్మా స్వరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ సర్వీస్గగా నామకరణం చేసింది. గతంలో మోదీ ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన సుష్మ గుండెపోటు కారణంగా గతేడాది ఆగస్టు 6న కన్నుమూశారు. సుష్మ గౌరవార్థం ఈ రెండు ఇనిస్టిట్యూట్‌లకు ఆమె పేరు పెట్టినట్టు విదేశాంగ శాఖ తెలిపింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/