కరోనా బారినపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరోనా బారినపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర జలుబు తో బాధపడుతున్న ఈయన… నిన్న రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షలు కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తేలింది. ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ”నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. తేలికపాటి లక్షణాలు. ఇంట్లోనే నేను ఐసోలేషన్‌ లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు, ఐసోలేషన్‌ లో ఉండాలి. అలాగే అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి” అని కోరారు. ఇక దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత నాల్గు రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతితో కరోనా కేసులు మళ్లీ భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దిల్లీలో 6నెలల తర్వాత అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 81శాతం ఒమిక్రాన్ వేరియంట్​వే కావడం ఆందోళన కలిగిస్తుందని ఆయన అన్నారు.

ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4099 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా… ఒకరు మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 1,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే దేశ రాజధానిలో కోవిడ్ పాజిటివీటి రేటు 6.49 శాతంగా ఉంది. ప్రస్తుతం 10,986 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 25,100గా నమోదు అయ్యింది. గత 24 గంటల్లో భారతదేశంలో 10,846 రికవరీలు నమోదు అయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,582గా ఉంది.