కర్ణాటక: ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రైవేట్ బస్సుల రవాణాకు అనుమతి

ఎప్పటికప్పు డు బస్సుల శానిటైజ్‌

Karnataka-Permission to transport RTC buses
Karnataka-Permission to transport RTC buses

Bangalore: : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో పాటు,  ప్రైవేట్ బస్సుల రవాణాకు అనుమతి ఇచ్చింది. బస్సులను ఎప్పటికప్పు డు శానిటైజ్‌ చేయనున్నారు.

ఈ విషయాన్ని కర్ణాటక సీఎం యెడియూరప్ప అధికారికంగా ప్రకటించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాకడౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామన్నారు.

ఇతర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు అనుమతి ఇచ్చారు. అయితే ఆదివారం   రాష్ట్రం మొత్తం లాకడౌన్‌ అమల్లో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

హోం క్వారంటైన్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. అన్ని దుకాణాలు తెరుచుకుంటాయని సీఎం చెప్పారు. రాష్ట్ర పరిధిలో అన్ని రైళ్లు నడుస్తాయని సీఎం యోడియూరప్ప పేర్కొన్నారు.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరస్పర అంగీకారంతో వాహనాలు, బస్సులు తదితర ప్రజారవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనే తుది నిర్ణయమని కేంద్రం ప్రకటించింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/