డెక్కన్‌ క్రానికల్‌ మాజీ చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి అరెస్ట్‌

డెక్కన్‌ క్రానికల్‌ మాజీ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ మోసం, మనీలాండరింగ్ కేసులో ఆరోపణల ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు అయిన వెంకట్రామిరెడ్డితోపాటు పీకే అయ్యర్‌, డీసీ ఆడిటర్‌ మణి ఊమెన్‌లను కేసులో అదుపులోకి తీసుకున్నది.

కెనరా బ్యాంక్‌, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వెంకట్రామ్‌రెడ్డితోపాటు మరో ఇద్దర్ని కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 8 వేల కోట్లతో బ్యాంకులను మోసం చేశారన్న కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ముందు సిబీఐ ఈ కేసులో దర్యాప్తు చేసింది. అనంతరం ఈడీ ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజుల నుంచి విచారించిన తర్వాత ఇవాళ అదుపులోకి తీసుకుంది. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని నిధులు మళ్లించారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.