చిన్నారులతో జరుపుకున్న ఈ పండుగ ప్రత్యేకంః ప్రధాని మోడి

దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని

Daughters Of Staff Members At PM’s Office Tie Him Rakhi

న్యూఢిల్లీః నేడు ప్రధాని మోడి చేతికి సిబ్బంది కుమార్తెలు అయిన చిన్నారులు రాఖీ కట్టారు. ప్రధానమంత్రి ఇంటి వద్ద జరిగిన ఈ ప్రత్యేక రక్షా బంధన్ వేడుకలో పాల్గొన్న వారిలో స్వీపర్లు, ప్యూన్లు, తోటమాలి, డ్రైవర్లు, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పనిచేస్తున్న ఇతరుల కుమార్తెలు ఉన్నారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ వేడుకలు జరిగాయి.

రాఖీ కట్టిన చిన్నారులతో మోడీ ఆప్యాయంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. చిన్నారులతో జరుపుకున్న ఈ రక్షా బంధన్ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. అంతకుముందు రక్షా బంధన్ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/