నాలుగు పదుల్లోనూ యవ్వనంగా..

జీవన శైలి

Beauty and health with peanuts

పాతికేళ్ళు నిండని కొందరు అమ్మాయిల ముఖంపై ముడతలు, గీతలు వస్తుంటే , నలభై ఏళ్ళు దాటిన కొంత మంది అమ్మాయిల ముఖం మాత్రం మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది.. దీనికి కారణం తీసుకునే ఆహారం కూడా కారణం అంటున్నారు నిపుణులు..

వృద్దాప్య ఛాయల్ని అడ్డుకోవాలంటే ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలను తప్పను సరిగా తీసుకోవాలి.. వాటిలోని యాంటీ ఆక్సీడెంట్స్, పోషకాలు, విటమిన్స్ , ఖనిజ లవణాలు చర్మాన్ని ఆరోగ్యముగా ఉంచి. వయసు పైబడిన సంకేతాలను దారికి చారనీయవము.. గింజ ధాన్యాలు, గోధుమ, బ్రౌన్ రైస్, గుడ్లు, తాజా కూరగాయలు, విత్తనాలు, తాజా పండ్లు వంటివి శరీరాన్ని, చర్మాన్ని ఆరోగ్యముగా ఉంచటమే కాదు, మెదడు పైన మంచి ప్రభావాన్ని చూపిస్తాయి..

కుర్ కృమిన్: ఇందులోని యాంటీ ఆక్సీడెంట్ గుణాలు కణాల అభివృద్ధికి తోడ్పడుతాయి.. ఎప్పటికప్పడు కొత్త కణాలు ఏర్పడి ముఖ చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి. .. వంటకాల్లో పసుపు వాడకాన్ని పెంచాలి.. అలాగే రోజూ గ్రీన్ టీ తీసుకోవటం మంచిది.. ఇందులోని పాలీ ఫినాల్ కాంపౌండ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.. వయసు పైబడుతున్నట్టు ముఖంలో వచ్చే ముడతలను త్వరగా దరిచేరనివ్వదు..

వేరు శెనగ:

ఈ పప్పులో వుండే రెస్వెరాట్రాల్ ఎంజైమ్స్ ను ఉత్తేజ పరచి చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది.. ఈ తరహా ఎంజైమ్ ద్రాక్ష బ్లూ బెర్రీస్, కోకోవా, డార్క్ చాకోలెట్స్ లో నూ లభ్యమవుతుంది.. వీటికి రోజూ మెనూలో చోటు ఇస్తే చాలు,. మెరిసే ముఖం సొంతం అవుతుంది.. టమాటో లోని లైకోపీన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది.. పింక్ ద్రాక్షలోకూడ లైకోపీన్ ఉంటుంది.. అందుకే రోజూ తినే వాటిలో వీటికి చోటివ్వండి… మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి..

‘నాడి ‘ (ఆరోగ్య సమస్యలు, చిట్కాలు ) కోసం : https://www.vaartha.com/specials/health1/