విశాఖ ఘటనపై ప్రధాని కి చంద్రబాబు లేఖ

విచారణ కోసం సైంటిఫిక్ కమిటీ ఏర్పాటు చేయండి

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విశాఖ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు. గ్యాస్‌ లీక్‌పై దర్యాప్తు చేస్తేనే భవిష్యత్‌లో ప్రజల ఆరోగ్యం ప్రభావం తెలుస్తుందన్నారు. కాగా ఈ ఘటనపై సత్వరమే స్పందించినందుకు ప్రధానికి అభినందనలు తెలిపిన చంద్రబాబు.. గ్యాస్ లీకేజీపై విచారణ కోసం సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని, విషవాయువు లీకేజీకి దారితీసిన అంశాలపై దర్యాప్తు జరిపించాలని ఆ లేఖలో కోరారు. పరిశ్రమ నుంచి లీకైన వాయువును స్టిరీన్‌గా కంపెనీ చెబుతోందని, కానీ దానితోపాటు మరిన్ని వాయువులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయని, కాబట్టి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/