దసరా ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ అంటే..

నేచురల్ స్టార్ నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ గత కొద్దీ రోజులుగా వివిధ భాషల్లో ప్రమోషన్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ను అనంతపురం లోని ఆర్ట్స్ కాలేజీ లో అట్టహాసంగా జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. ఈ నెల 26వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాయలసీమలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం నానికి కొత్త ఎక్స్ పీరియన్స్ గా చెప్పొచ్చు.

ఇప్పటివరకూ నాని నటించిన ఏ సినిమా ఈవెంట్ బయట ప్రదేశాల్లో జరగలేదు. అందులోనూ రాయలసీమలో జరిగింది లేదు. దీంతో దసరా ఈవెంట్ ని చిత్ర దర్శక నిర్మాతలు వేదికగా సీమని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలంగాణ దసరా నేపథ్యంలో సాగే స్టోరీ. ఇక్కడి యువతని స్పూర్తిగా తీసుకుని డిజైన్ చేసిన క్యారెక్టర్ అది. కథ అంతా సింగరేణి బొగ్గు గనుల్లో సాగుతుంది.

నాని కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి సముద్రఖని సాయి కుమార్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యం సూర్య సినిమాటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.