ఓవర్సీస్ లో 2 మిలియన్‌ మార్క్‌ను సాధించిన దసరా

ఓవర్సీస్ లో దసరా అరుదైన రికార్డు సాధించింది. నాని – కీర్తి సురేష్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా మూవీ మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. విడుదల రోజు నుండి ఇప్పటివరకు అనేక చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది;. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తూవస్తుంది. తాజాగా 2 మిలియన్ మార్క్ సాధించింది.

ఇదే జోరు కొనసాగితే ఫైనల్‌ రన్‌లో ఈ మూవీ 3 మిలియన్‌ మార్క్‌ కూడా టచ్‌ చేస్తుందనడంలో సందేహమే లేదు. ఇక మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న శాకుంతలం, రుద్రుడు సినిమాలపై పెద్దగా బజ్‌ లేదు. ఆ తర్వాత రోజు రిలీజవుతున్న విడుదల పార్ట్‌-1 అసలు విడుదలవుతున్న విషయమే సగం జనాలకు తెలియదు. దాంతో వచ్చే వారం కూడా దసరాకు కలిసి వచ్చే చాన్స్‌ ఉందని అంటున్నారు.