రెండో రోజు తగ్గిన దాస్ కా ధమ్కీ కలెక్షన్స్

విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఉగాది కానుకగా మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ , సాంగ్స్ తో ఆకట్టుకోవడం తో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పరుగులు పెట్టారు. కానీ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం లో సినిమా విఫలమైంది. ఫస్ట్ డే నే యావరేజ్ టాక్ రావడం తో రెండో రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు భారీగా తగ్గాయి.

ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ.8.88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల గ్రాస్ రూ.6.5 కోట్లు రాబట్టగా, రూ.3.2 కోట్ల మేర షేర్ రాబట్టింది. రెండో రోజు మాత్రం కాస్త కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఇక రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.11.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.6 కోట్ల మేర ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.8 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. కాబట్టి ఇంకో రూ.2 కోట్ల షేర్ వసూలు చేస్తే విశ్వక్ సేన్ సినిమా గట్టెక్కేసినట్టే.