ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఫై ప్రముఖుల స్పందన ఎలా ఉందంటే ..

ఆర్ఆర్ఆర్ నుండి అసలుసిసలైన ట్రైలర్ వచ్చేసింది..ట్రైలర్ చూసిన వారంతా ఏమన్నా ఉందా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కేవలం అభిమానులే కాదు చిత్రసీమ ప్రముఖులు సైతం వావ్..అంటూ జక్కన్న కు జై జై లు కొడుతున్నారు. ఇక ఎవరెవరు ఎలా స్పందించారో చూద్దాం.

  • అద్భుతమైన ఎలివేషన్స్‌, పవర్‌ఫుల్‌ రోల్‌, ఎమోషనల్‌ డైలాగ్స్‌తో ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సినిమా చూడటానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా – క్రిష్‌
  • రాజమౌళిగారు ట్రైలర్‌ చూస్తుంటే మతిపోతోంది. టీమ్‌ అందరికీ అభినందనలు – కరణ్‌ జోహార్‌
  • ట్రైలర్‌ వేరే లెవల్‌లో ఉంది. చాలా గర్వంగాఉంది. – విజయ్‌ దేవరకొండ
  • ఎమోషన్‌, యాక్షన్‌ పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌. హీరోలిద్దరి స్ర్కీన్‌ ప్రజెన్స్‌ అదరగొట్టేలా ఉంది. అంచనాలకు మించి ట్రైలర్‌ ఉంది. భారతదేశంలో పుట్టిన ఉత్తమ దర్శకుడు రాజమౌళి. – కోన వెంకట్‌
  • టేక్‌ ఏ బౌ రాజమౌళి.. ట్రైలర్‌ అదిరిపోయింది – గోపీచంద్‌ మలినేని
  • ట్రైలర్‌ ఆద్యంతం సర్‌ప్రైజ్‌లతో నిండిపోయింది. ఎమోషన్స్‌, ఎలివేషన్స్‌పై తనకున్న పట్టుని రాజమౌళి మరోసారి చూపించారు. – బాబీ
  • విజువల్స్‌ చూశాక మాటలు రావడం లేదు. అల్లూరిగా చరణ్‌, భీమ్‌గా తారక్‌ని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. టీమ్‌ ఈ సినిమా కోసం ఎంతగా శ్రమించారో ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తోంది. – వెంకీ కుడుముల

యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దేశం మొత్తం మీద ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ప్రేక్షకుల్నిఈ చిత్రం అలరించబోతుంది.

YouTube video