జీవిత రాజశేఖర్ ను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్ల చేతిలో జీవిత రాజశేఖర్ మోసపోయింది. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సినీ , రాజకీయ ప్రముఖులను సైతం మోసం చేస్తున్నారు. తాజాగా సినీ నటి , నిర్మాత జీవిత రాజశేఖర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. జియో స్మార్ట్ స్టోర్లో ఆఫర్ల పేరుతో లక్షా 22 వేల రూపాయలు కొల్లగొట్టారు. దీనిపై జీవిత రాజశేఖర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో నిందితుడు నాగేందర్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సైబర్ క్రైం ఏసీపీ ఏవీఎం ప్రసాద్ తెలిపారు.

జియో బహుమతుల పేరుతో లక్షన్నర రూపాయల మేర జీవితారాజశేఖర్‌కు సైబర్‌ నేరగాళ్లు మోసం చేసారు. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామంటూ ఛీటింగ్‌ చేశారని, అలా తెలిసినవారి పేరు చెప్పి జీవితారాజశేఖర్‌కు టోకరా వేశారు. తెలిసినవాళ్లని నమ్మి లక్షన్నర రూపాయలు బదిలీ చేసిన జీవిత మేనేజర్ ఆ డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు చెన్నైకి చెందిన నరేష్‌ని అరెస్టు చేసి అతన్ని విచారించారు. ఈ సమయంలో సైబర్‌క్రైమ్ పోలీసులు నరేష్ గతంలోనూ నటీనటులతోపాటు ప్రొడ్యూసర్స్‌ని మోసం చేసినట్టు గుర్తించారు.