పాకిస్తాన్‌ నేషనల్ బ్యాంకుపై సైబర్‌ దాడి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని రెండో అతిపెద్ద బ్యాంకులోకి హ్యాకర్లు చొరబడ్డారు. నేషనల్ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ (ఎన్‌బీపీ)పై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ స్టేట్‌ బ్యాంక్‌ ట్విట్టర్‌లో వెల్లడించింది. సైబర్‌ దాడి జరిగిన మాట వాస్తవమే అని, అయితే డబ్బు, డాటా రెండూ సురక్షితంగా ఉన్నాయని ఎన్‌బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. సైబర్‌ దాడి అనంతరం బ్యాంకుకు సంబంధించి కొన్ని రకాల సేవలను నిలిపివేసినట్లు బ్యాంక్ వెల్లడించింది.

సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కేసు నమోదు చేసుకుని సైబర్‌ సెల్‌ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సైబర్ దాడి ఘటన జరిగినట్లు మరే ఇతర బ్యాంకు పేర్కొనలేదని ఎన్‌బీపీ తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందీ, లేనిదీ పరిశీలిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. అక్టోబరు 30 తెల్లవారుజామున బ్యాంక్ సర్వర్లపై సైబర్ దాడి జరిగినట్లు గుర్తించినట్లు నేషనల్ బ్యాంక్ పేర్కొన్నది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/