కరోనా మహమ్మారి..పెరుగనున్న ఆకలి చావులు..ఐరాస

ప్రజలు ఆకలి చావుల్లో చిక్కుకోకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి

hunger-deaths

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ కారణంగా పలు దేశాలు ఆర్థికంగా అతలాకుతలమైపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు అప్రమత్తం కాకుంటే ప్రపంచం మొత్తం ఆకలి చావులలో చిక్కుకుంటుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. కొవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో వచ్చే ఏడాది ఆకలి చావులు పెరిగే అవకాశం ఉందని ఐరాసకు చెందిన ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లే హెచ్చరించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని సూచించారు. కరోనా కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆకలి చావుల్లో చిక్కుకోకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. కొన్ని దేశాల్లో ఉపశమన ప్యాకేజీలు అందిస్తున్నారని అన్నారు. ఏదిఏమైనప్పటికీ 2021 ఆకలి చావుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తలకిందులయ్యిందని, చాలామంది ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు కోల్పోయారని ఆవేదనం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా చాలా దేశాలు తిరిగి లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తుండగా, మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయని డేవిడ్ బీస్లే తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/