తాలిబన్ల దాడి..16మంది సైనికులు హతం

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు గోజర్గాఏనూర్ జిల్లాలోని బాగ్లాన్ ప్రావిన్స్‌లోని భద్రతా తనిఖీ కేంద్రంపై దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రావిన్స్‌లోని పోలీసుల హెడ్‌క్వార్టర్స్ సమీపంలో తాలిబన్లకు భద్రతాదళాలకు మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అంతర్ఆఫ్ఘన్ చర్చలను ప్రారంభించేలా ఖైదీల మార్పిడీకి అష్రఫ్ ఘని ప్రభుత్వం తాలిబన్లతో శాంతిచర్చలు జరపుతున్నాదాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు నెలల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/