ఎస్‌ఈసి ప్రకటన ఆశ్చర్యమేస్తుంది

టిడిపి నాయకుడు వర్ల రామయ్య

varla ramaiah
varla ramaiah

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషనర్‌గా కొత్తగా నియమించిన జస్టిస్‌ కనగరాజ్‌ ప్రభుత్వ రుణం తీర్చుకోవడానికి తొందరపడుతున్నట్లు ఉందని టిడిపి నాయకుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ క్షణంలో నైనా ఎన్నికలు జరగవచ్చని కమీషనర్‌ సూచించిన నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా ఆయన ఈ విధంగా స్పందించారు. రాష్ట్రంలో కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల నిర్వహాణ గురించి మాట్లాడడం ఆశ్చర్యమేస్తుంది. ఏ క్షణంలో నైనా ఎన్నికుల జరగవచ్చని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తోందని ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/