జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష

జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష
Chief Secretary Somesh Kumar

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న సమావేశంలో ధరణి పోర్టల్‌తో పాటు వ్యవసాయేతర భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చే ప్రక్రియ, రిజిస్ట్రేషన్ల సన్నాహకాలు, రిజిస్ట్రేషన్లు చేయడానికి అదనంగా తహసీల్దార్‌ కార్యాలయానికి ఏయే మౌలిక సదుపాయాలు అవసరం వంటివాటిపై జిల్లాల వారీగా ఆరా తీయడంతోపాటు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయేతర భూములు, ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చి, డేటాను నవీకరించడానికి అదనపు కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించనున్నారు. అలాగే రైతు వేదికల నిర్మాణం, ఎల్‌ఆర్‌ఎస్‌, వీధివ్యాపారులు, వైకుంఠధామాల నిర్మాణం, కస్టమ్స్‌ మిల్లింగ్‌పై సమీక్షించనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/