ఐసీసీ పుల్‌షాట్స్‌ పోల్‌పై విమర్శలు

రోహిత్‌ను మరచిన ఐసీసీ

rohit sharma
rohit sharma

ముంబయి: వివ్‌ రిచర్డ్స్‌, రికీ పాంటింగ్‌, హెర్ష్‌లే గిబ్స్‌, విరాట్‌ కోహ్లి ల ఫోటోలను పోస్టు చేసి వీరిలో ఎవరు బాగా పుల్‌షాట్స్‌ ఆడతారంటూ ఐసీసీ ఒక పోల్‌ నిర్వహించింది. ఇందులో పుల్‌షాట్స్‌ బాగా ఆడే రోహిత్‌శర్మ పేరు లేకపోవడంతో అతని అభిమానులు ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ నిర్వహించే ఈ పోల్‌లో తాను లేకపోవడంతో ఇందులో ఒకరు మిస్సయినట్టున్నారే… అంటూ ట్వీట్‌ చేశాడు. దీనితో దిగొచ్చిన ఐసీసీ రోహిత్‌ పుల్‌షాట్స్‌కు సంబంధించిన ఒక వీడియోను పోస్టుచేసి రోహిత్‌ అభిమానుల నుంచి విమర్శలు రాకుండా తప్పించుకుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/