సచిన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
శాంతా క్లాజ్ గెటప్‌లో గ్రీటింగ్స్

Mumbai: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ అకౌంట్లో వీడియోను పోస్టు చేసిన సచిన్.. శాంటా క్లాజ్ గెటప్‌లో గ్రీటింగ్స్ చెప్పారు.
ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని, సోదరభావానికి, సేవభావానికి క్రిస్మస్ పండుగ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
మనతో ఉన్న వారి కోసం ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మారుద్దామని అన్నారు. చిన్న చిన్న రీతుల్లోనైనా ఆ వేడుకలు జరుపుకోవాలన్నారు. క్రీడాకారులు క్రిస్టియానో రోనాల్డో, నోవాక జోకోవిచ్‌లు కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలిపారు.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/