హైదరాబాద్ ప్రాపర్టీ షో 13వ ఎడిషన్‌ను ప్రకటించిన క్రెడాయ్

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 2024 మార్చి 8 నుండి 10వ తేదీ వరకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 జరుగనుంది. ఒకే చోట నగరంలోని అత్యధిక సంఖ్యలో బిల్డర్‌ల వద్ద ఉత్తమమైన డీల్‌లను పొందేందుకు, అత్యుత్తమ గృహాలను ఎంచుకోవడానికి ఉత్తమ అవకాశం.

Credai announces the 13th edition of the Hyderabad Property Show

హైదరాబాద్‌ః దేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌ల అత్యున్నత సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా, 13వ ఎడిషన్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ను హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 2024 మార్చి 8 మరియు 10 మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించింది. శ్రీ వి రాజశేఖర్ రెడ్డి – ప్రెసిడెంట్, శ్రీ ఎన్. జైదీప్ రెడ్డి – ప్రెసిడెంట్ ఎలెక్ట్, శ్రీ బి. జగన్నాథరావు – జనరల్ సెక్రటరీ, క్రెడాయ్ హైదరాబాద్, శ్రీ కొత్తపల్లి రాంబాబు – ప్రాపర్టీ షో కన్వీనర్ మరియు వైస్ ప్రెసిడెంట్ క్రెడాయ్ హైదరాబాద్ తో కూడిన క్రెడాయ్ సీనియర్ నాయకత్వ బృందం సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు – శ్రీ బి ప్రదీప్ రెడ్డి, శ్రీ సి జి మురళీ మోహన్, శ్రీ ఎం శ్రీకాంత్ , కోశాధికారి – శ్రీ మనోజ్ కుమార్ అగర్వాల్ *, సంయుక్త కార్యదర్శులు – *శ్రీ జి. నితీష్ రెడ్డి మరియు శ్రీ క్రాంతి కిరణ్ రెడ్డి తో పాటు ప్రాపర్టీ షోకు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు – కో-కన్వీనర్లు శ్రీ ఎం శ్రీరామ్ మరియు శ్రీ ఎన్ వంశీధర్ రెడ్డి, క్రెడాయ్ యూత్ వింగ్ (సివైడబ్ల్యు) కోఆర్డినేటర్ శ్రీ ఎం. అరవింద్ ఆనందరావు, శ్రీ పవీన్, సెక్రటరీ సివైడబ్ల్యు మరియు శ్రీ ధీరజ్ పాల్గొన్నారు.

అతిపెద్ద రియల్ ఎస్టేట్ & ప్రాపర్టీ షో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024. ఇక్కడ గృహ కొనుగోలుదారులు తమ అవసరాలు, ఎంచుకున్న ప్రదేశం , బడ్జెట్ ఆధారంగా తమ కలల ఇంటిని కనుగొనగలిగే అవకాశం వుంది. ఇక్కడ, కొనుగోలుదారులు నేరుగా డెవలపర్‌లు మరియు బిల్డర్‌లను కలుసుకోవచ్చు , వారితో తమ అవసరాలను గురించి వెల్లడి చేయవచ్చు. ఒకే చోట ఉత్తమమైన గృహాలు మరియు ఉత్తమ డీల్‌లను స్వీకరించవచ్చు. నగరం అంతటా జరుగుతున్న అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి మరియు హౌసింగ్ , కమర్షియల్ రియల్ ఎస్టేట్ కోసం డిమాండ్ దృష్ట్యా, హైదరాబాద్‌లోని అత్యుత్తమ మరియు అత్యంత విశ్వసనీయమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించి ప్రాపర్టీ షోను క్రెడాయ్ హైదరాబాద్ రూపొందించింది. ఈ ప్రాపర్టీ షోలో, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, విల్లాలు, ప్లాట్లు మరియు కమర్షియల్ స్పేస్‌లను కలిగి ఉన్న ఉత్తమ ప్రాజెక్ట్‌లు ప్రదర్శించబడతాయి…” అని అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో స్థిరమైన పెరుగుదలను కనబరుస్తోంది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ, నగరం గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉంది, నవంబర్ 2023లో నివేదించబడిన ఆస్తి లావాదేవీలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. మునుపటి సంవత్సరంతో పోల్చితే నవంబర్ 2023లో ప్రాపర్టీ డీల్‌లలో 25% పెరుగుదల ఉంది. ఇది హైదరాబాద్‌లో సొంత ఇంటిని కలిగి ఉండాలనే వ్యక్తుల బలమైన ఆసక్తిని సూచిస్తుంది. ఈ కాలంలో 6,268 ఆస్తి ఒప్పందాలు జరిగాయి, ఇది గణనీయమైన స్టాంప్ డ్యూటీ ఆదాయానికి తోడ్పడింది. ఈ ఆస్తుల మొత్తం విలువ ఆకట్టుకునే రీతిలో రూ. 3.741 కోట్లు కు చేరుకుంది, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే విలువలో గణనీయమైన రీతిలో 29% వృద్ధిని చూపుతోంది. ముఖ్యంగా, సౌకర్యాలు, భద్రత మరియు పెట్టుబడిపై ఆశాజనకమైన రాబడితో కూడిన విలాసవంతమైన జీవనశైలి కోరికను ప్రతిబింబిస్తూ, ఖరీదైన గృహాలను ఎంచుకుంటున్న వ్యక్తుల యొక్క ఆశ్చర్యకరమైన ధోరణి ఇక్కడ ఉంది. ప్రీమియం గృహాల వైపు ఈ మార్పు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నగరం యొక్క స్థిరత్వం ను నొక్కి చెబుతుంది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో యొక్క 13వ ఎడిషన్ ఇంటి కొనుగోలుదారులకు నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన బిల్డర్ల నుండి అత్యుత్తమ ప్రాజెక్ట్‌లను ఒకే చోట చూడడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది…” అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ , “2024లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో నగరంలో వృద్ధి జోరు కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం రూ. 40,000/- కోట్లకు పైగా తాజా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించింది , మరిన్ని కార్యాలయాలు మరియు నివాస స్థలాలను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఇవి పెంచనున్నాయి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, విమానాశ్రయాన్ని కూడా అనుసంధానించడానికి మరియు నగర జనాభాలో ఎక్కువ మంది అవసరాలను తీర్చడానికి మెట్రో రైలు యొక్క 2వ దశను ఆమోదించారు. ‘ది మూసీ కారిడార్’ను పర్యాటక మరియు వ్యాపార గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి మరియు నగరం యొక్క ఆకర్షణను పెంచడానికి వివిధ ప్రపంచ నమూనాలను అధ్యయనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో బలమైన వృద్ధి కొనసాగే అవకాశం ఉందన్న విశ్వాసాన్ని ఈ కార్యక్రమాలు మనకు అందజేస్తున్నాయి. దేశీయ ద్రవ్యోల్బణం స్థాయిలు మెరుగుపడడం మరియు భారతదేశ ఆర్థిక వృద్ధి ప్రపంచ ధోరణులను అధిగమిస్తుండటం వల్ల , రాబోయే త్రైమాసికాలలో భారతదేశ రియల్ ఎస్టేట్ రంగ వృద్ధి ఊపందుకుంటున్నదని అంచనా వేయబడింది. రెపో రేటును కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం 2024లో ఈ రంగానికి అదనపు మద్దతునిచ్చే అవకాశం ఉంది. ధరల సవరణ తర్వాత ఆస్తిని కొనుగోలు చేయడానికి వేచి ఉన్న ఇంటి కొనుగోలుదారు ఎవరైనా వెంటనే నిర్ణయించుకోవాలి లేదా వారు ఎంపిక చేసుకున్న ఆస్తి కి ప్రీమియం చెల్లించడం చేయాల్సి ఉంటుంది . ఎందుకంటే , భవిష్యత్తులో ప్రాపర్టీ ధరలు వేగంగా పెరుగుతాయని మేము ఆశిస్తున్నాము…” అని అన్నారు.

శ్రీ ఎన్ . జైదీప్ రెడ్డి – ప్రెసిడెంట్ ఎలెక్ట్, క్రెడాయ్ హైదరాబాద్ మాట్లాడుతూ “హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ నగరం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతిబింబించడమే కాకుండా వృద్ధి, నమ్మకం మరియు విలువపై నిర్మించిన రియల్ ఎస్టేట్ పర్యావరణ వ్యవస్థను కూడా ప్రదర్శిస్తుంది. ఇది పెట్టుబడిదారులను మరియు ఇంటి యజమానులను ఆకర్షిస్తుంది. స్థిరాస్తి లావాదేవీలు మరియు స్టాంప్ డ్యూటీ ఆదాయంలో నిరంతర పెరుగుదల మార్కెట్ యొక్క విశ్వాసం మరియు ఆశావాదాన్ని ప్రదర్శిస్తుంది. పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పటిష్టంగా ఉంది, కొనుగోలుదారులు మరియు అమ్మకందారులకు అవకాశాలను అందిస్తోంది. దాదాపు 35-38 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో హై-క్వాలిటీ బిజినెస్ పార్కులను జోడించే యోచనతో హైదరాబాద్ రాబోయే రెండేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన వృద్ధిని సాధించేందుకు సిద్ధమవుతోంది. ఈ విస్తరణలో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు మరియు వ్యవస్థాపకులకు ఆధునిక నివాస సముదాయాల నుండి అధునాతన వాణిజ్య స్థలాలు మరియు రిటైల్ ఎంపికల వరకు విభిన్న అవకాశాలు ఉన్నాయి. మార్చి 8 నుండి 10 వరకు షెడ్యూల్ చేయబడిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఇంటి కొనుగోలుదారులకు ఒకే చోట నగరంలోని ఉత్తమ ప్రాజెక్ట్‌లను వీక్షించడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది…” అని అన్నారు.

శ్రీ బి. జగన్నాథ్ రావు – జనరల్ సెక్రటరీ, క్రెడాయ్ హైదరాబాద్ మాట్లాడుతూ “ హైదరాబాద్‌లో ఔట్‌సోర్సింగ్ కేంద్రాలు, బ్యాక్ ఆఫీస్‌లు, R&D సౌకర్యాలు మరియు ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను స్థాపించడానికి నగరం యొక్క శక్తివంతమైన వ్యాపార వాతావరణం ప్రపంచ సంస్థలను ఆకర్షించింది. ఆఫీస్ స్పేస్ కోసం పెరిగిన డిమాండ్ ఇన్వెస్ట్‌మెంట్-గ్రేడ్ ఆఫీస్ స్టాక్‌లో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది, 2022లో 100 మిలియన్ చదరపు అడుగులను అధిగమించింది మరియు సెప్టెంబర్ 2023 చివరి నాటికి 119 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది – 2019 నుండి పోల్చి చూస్తే 63% పెరుగుదల కనిపించింది. లైఫ్ సైన్సెస్, BFSI మరియు సాంకేతికత వంటి కీలక రంగాల తోడ్పాటు తో పాటుగా ఇయర్ ఆన్ ఇయర్ 35% పెరుగుదలతో 2023 మొదటి తొమ్మిది నెలల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కోసం జాబితా చేయబడ్డ మొదటి మూడు నగరాలలో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ప్రధాన లాంచ్‌లను చూస్తోంది, రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో 1,30,000 రెసిడెన్షియల్ యూనిట్లు వచ్చే అవకాశం ఉంది. సాంకేతిక రంగ వృద్ధి మరియు పారిశ్రామికీకరణ వంటివి IT కారిడార్ మరియు విస్తరించిన IT కారిడార్ వంటి కీలక కార్యాలయ ప్రాంతాల సమీపంలో నివాస అభివృద్ధికి దారితీసింది. బహుళజాతి కంపెనీ ఉద్యోగుల నుండి డిమాండ్ మరియు మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధి నివాస మార్కెట్ మరియు మొత్తం జీవన ప్రమాణాలను పెంచాయి.

గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, కోకాపేట్, పుప్పాలగూడ, నార్సింగి, తెల్లాపూర్, కొంపల్లి, శామీర్‌పేట్ వంటి కొన్ని సూక్ష్మ మార్కెట్లు గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ దేశంలోని రియల్ ఎస్టేట్ పెట్టుబడులలో అత్యుత్తమ ROIలను అందిస్తోంది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 నగరంలోని ఉత్తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను ఒకే చోట చూసే అవకాశం అందించటం తో పాటుగా తాము కోరుకున్న ప్రాపర్టీ ని పొందటం లో ప్రజలకు సహాయ పడుతుంది. ఇది ‘సబ్సే బెహతర్ ఘర్ ఖరీద్నే కా మౌకా, సబ్సే బడే డీల్స్ పానే కా మౌకా, సబ్సే జ్యాదా బిల్డర్స్ సే మిల్నే కా మౌకా’ అందిస్తుంది. కాబట్టి హైదరాబాదులో ఇల్లు కొనుగోలు చేయడానికి ఉత్తమమైన ‘మౌకా’ని పొందాలని గృహ కొనుగోలుదారులందరికీ ఇది పిలుపు” అని అన్నారు.