150 కోట్ల క్లబ్ లో హ్యాట్రిక్ కొట్టిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సత్తా ఏంటో మరోసారి వాల్తేర్ వీరయ్య తో రుజువైంది. ఈ మూవీ వారం తిరిగే లోపే రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది. బాబీ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 13 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవి శ్రీ మ్యూజిక్ , రవితేజ కీలక పాత్రలో నటించడం , సంక్రాంతి బరిలో రావడం తో సినిమా ఫై అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాబీ తెరకెక్కించడం తో జనాలు బ్రహ్మ రధం పడుతున్నారు. సినిమా విడుదలై వారం కావొస్తున్నా ఇంకా టికెట్స్ దొరకని పరిస్థితి. చిరంజీవి నుండి అసలు సిసలైన సినిమా వస్తే ఎలా ఉంటుందో మరోసారి డైరెక్టర్స్ కు సినీ లవర్స్ కు అర్థమైంది.

కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయిన వాల్తేర్ వీరయ్య ఇప్పుడు 150 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. టాలీవుడ్ లో 150 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసిన సినిమాల జాబితాలో ఇప్పుడు వాల్తేర్ వీరయ్య చేరిందని చెప్పాలి. అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలలో 150 కోట్ల క్లబ్ లో చేరిన హీరోల జాబితా ఓసారి చూస్తే.. మహేష్ బాబు 5 సార్లు, ప్రభాస్ 4 సార్లు, చిరంజీవి 3 సార్లు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లో చేరారు. వీరి తర్వాత అల్లు అర్జున్ 2 ,రామ్ చరణ్ 2 , ఎన్టీఆర్ 2 , పవన్ కళ్యాణ్ 1 సారి 150 గ్రాస్ క్లబ్ లో తమ సినిమాలతో చేరారు.