చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

మెగాస్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ ల ఫై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బాషా దోషంగా భావించాలని.. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని స్పష్టం చేశారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోండని కోరారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం అందరూ కలిసి పని చేద్దామని.. వరద సహాయక చర్యల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలం అయ్యారని అగ్రహించారు. వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే పోలవరం వరద వివాదానికి కారణం చూపుతున్నారని నారాయణ అన్నారు.

అసలు నారాయణ అంతకు ముందు ఏమన్నారంటే… భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని నారాయణ తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడంటూ హాట్ కామెంట్స్ చేశారు. అల్లూరి విగ్రహావిష్కరణకు సూపర్ స్టార్ కృష్ణను వేదికమీదకు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని.. అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారాయన. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ సెటైర్లు వేశారు. ఈ కామెంట్స్ ఫై మెగా అభిమానులతో పాటు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’ అని నాగబాబు ట్వీట్లు చేశారు. ఇక అభిమానులైతే నారాయణ దిష్టి బొమ్మలను తగలపెట్టడం..సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో కామెంట్స్ పెట్టడం చేయడం తో నారాయణ తాను అన్న మాటలను వెనక్కు తీసుకున్నారు.