రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు 129 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ

న్యూఢిల్లీ : ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు 129 కోట్ల‌కు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శ‌నివారం వెల్ల‌డించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ‌ద్ద ఇంకా 21.65 కోట్ల డోసులు ఉప‌యోగించేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపింది. దేశ‌మంత‌టా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డిఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

వ్యాక్సిన్ సప్ల‌యి చైన్‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వెసులుబాటు క‌ల్పించేలా వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ముంద‌స్తు స‌మాచారం చేర‌వేస్తున్నామ‌ని తెలిపింది. టీకా కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఉచితంగా టీకా డోసులు పంపిణీ చేస్తున్నామ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/