రాంబాబు రాసలీలలు పేరుతో సినిమా – జనసేన నేత గాదె వెంకటేశ్వర రావు

ఏపీలో వైసీపీ vs జనసేన ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ నేతలు వరుసగా కామెంట్స్ చేస్తుండడం తో అంతే రీతిలో జనసేన నేతలు కూడా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. శనివారం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయిల ఆర్ధిక సాయం అందజేసి..వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో పవన్ ఫై వరుసపెట్టి వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం మీడియాతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. ‘చంద్రబాబు గారి దత్తపుత్రుడు’ అనే టైటిల్‌తో మేం సినిమా తీస్తాం.. ఎక్కువ మంది హీరోయిన్‌లు అవసరం అవుతారని నిర్మాతలు ముందుకు రావడం లేదని ఎద్దేవా చేసారు.

దీనికి జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు కౌంటర్ వేసాడు. పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తే వైసిపి వాళ్లకు తడిచిపోతుందని.. మంత్రులుగా పాత పాలేరులు స్గానంలో కొత్త పాలేరులు వచ్చారన్నారు. నేరస్తుడు అనే టైటిల్ తో మీ నాయకుడిపై సినిమా రాబోతుందని , రాంబాబు రాసలీలలు, పారిపోయిన అంబటి పేరుతో సినిమాలు తీస్తామని గాదె వెంకటేశ్వర రావు అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్ మెన్ కొట్టిన విషయం మర్చిపోయావా అంబటి అని నిలదీశారు. అంబటి చరిత్ర అంతా చీకటి మయం… అంబటి ని ఎంత మంది మహిళలు చెప్పులతో కొట్టారో చర్చ పెడదామా ? అని నిలదీశారు. నీ శాఖ గురించి ఏమైనా తెలుసా అంబటి.. రేపల్లె నుంచి ఎందుకు పారిపోయి వచ్చావో సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను పరామర్శించడం తప్పు అని దమ్ముంటే ప్రకటన చేయండని.. మీ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.