BRS ప్రతినిధుల సభలో అధిష్టానం ప్రవేశ పెట్టిన తీర్మానాలు ఇవే

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్‌ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
దేశంలో రైతు రాజ్యం స్థాపించాలని, ప్రతిరాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలని తీర్మానం చేశారు. 24 గంటల పాటు దేశ వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి కొత్త పాలసీ అమలు చేయాలని తీర్మానించారు. మన దేశ బ్రాండ్‌తో విదేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతి, దళితబంధు దేశ వ్యాప్తంగా అమలు, దేశంలో భారీ స్థాయిలో మౌళిక వసతులు కల్పన, దేశంలో బీసీ జనగణన, ద్వేషాన్ని విడిచి ప్రశాంతతకు దేశ పౌరులంతా ఏకం కావాలని తీర్మానం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు, పని చేయాలని తీర్మానించారు.