మల్లాది విష్ణుకు సిఎం బంపర్‌ ఆఫర్‌

కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ

malladi-vishnu- cm jagan
malladi-vishnu- cm jagan

విజయవాడ: ఏపి సిఎం జగన్‌ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కుతుందని అందరూ ఆశించారు. అయితే, వెల్లంపల్లి శ్రీనివాసరావును దేవాదాయ శాఖ మంత్రిగా నియమించారు జగన్. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నియమించారు. మల్లాది విష్ణు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి విజయంసాధించారు. అనంతరం 2014లో బోండా ఉమా చేతిలో ఓడిపోయారు. మరోసారి 2019లో మల్లాది విష్ణు సెంట్రల్ టికెట్ కోసం పట్టుబట్టారు. అప్పుడు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా అదే టికెట్ కావాలని పట్టుబట్టారు.

మల్లాది విష్ణుకు సిఎం బంపర్‌ ఆఫర్‌


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/