విశాఖలో ఒక్కరోజే 10 మందికి కరోనా
నగరంలో ఇప్పటి వరకు 99 కేసులు నమోదు

విశాఖ: విశాఖలో కరోనా వైరస్ తన పంజా విసురుతుంది. నిన్న ఒక్క రోజే నగరంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 99కి పెరిగింది. వందేభారత్ మిషన్లో భాగంగా విదేశాల నుంచి నగరానికి చేరుకున్న వారిలో ఐదుగురు కరోనా బారినపడగా, అచ్యుతాపురం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని చిట్టిబోయినపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్ సంక్రమించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/