రేపు సిఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

లాక్‌డౌన్‌, వ్యవసాయంపై సమీక్ష

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ రేపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ గడువు ముగుస్తుండటం, వానాకాలం వస్తుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై సిఎం రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు. కరోనాపై తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగిస్తున్న సరి, బేసి విధానాన్ని అలాగే కొనసాగించాలా? ఏవైనా మార్పులు చేయాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. వానాకాలం సమీపిస్తుండటంతో నియంత్రిత వ్యవసాయం, ఎరువుల లభ్యత, విత్తనాల అందుబాటుపైనా సిఎం సమీక్ష చేయనున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఎలా జరపాలన్న దానిపైనా చర్చించనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/