చెల్లిని అత్యాచారం చేసిన అన్న..అక్కడితో ఆగకుండా

చెల్లిని అత్యాచారం చేసిన అన్న..అక్కడితో ఆగకుండా
gang-rape-in-nizamabad

సభ్య సమాజం ఏమైపోతుందో అర్థంకావడం లేదు..జనాలు వావివరుసలు మరచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. మహిళా కనిపిస్తే చాలు కామంతో చూస్తూ వారిపై పశువుల పడి కోరిక తీర్చుకుంటున్నారు. ఆఖరికి తండ్రి , అన్న , బాబాయ్ వంటి వారు కూడా కామాందులుగా మారుతున్నారు. తాజాగా అస్సాం లో వరుస కు చెల్లి అయ్యే యువతీ ని అత్యాచారం చేయడమే కాదు ఆమె నగ్న ఫోటోలు తీసి ఆమెకు కాబోయే వ్యక్తికి పంపి పెళ్లి ఆగిపోయేలా చేసాడు.

వివరాల్లోకి వెళ్తే..

అస్సాం రాజధాని దిస్పూర్‌ కి చెందిన సదరు యువతికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లి ముహూర్తం కూడా ఇరు కుటుంబ సభ్యులు ఖరారు చేసుకున్నారు. అంత పెళ్లి సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో వరుడి ఫోన్ కు పెళ్లి చేసుకునే యువతీ తాలూకా నగ్న ఫోటో వచ్చింది. ఆ పిక్ చూసి షాక్ అయ్యాడు. ఆ ఫొటో చూసిన వధువు సైతం కంగారుపడి, కన్నీటి పర్యంతమయ్యింది. తల్లిదండ్రులు ఏమి జరిగిందని ఆరా తీయడం తో తాను చదువుకునే రోజుల్లో జరిగిన ఓ సంఘటనను తెలిపింది.

వరుసకు సోదరుడు(కజిన్), అతని ఫ్రెండ్స్ కారులో వచ్చారని, అతనే తనను ఇంటికి తీసుకువెళ్తానంటే నమ్మి కారు ఎక్కినట్లు తెలిపింది. ఆ తరువాత వారు తనకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తనకు తాగించారని, అనంతరం తనపై అత్యాచారం చేసినట్లు వివరించింది. అప్పుడే ఈ నగ్న ఫొటోలను తీసి ఉంటారని, తనకు పెళ్లి కాకుండా చేయడానికే ఈ ఫొటోలను బయటపెట్టారని యువతి వాపోయింది. అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.