బియ్యంతో శానిటైజర్ల తయారీపై స్పందించిన రాహుల్‌

దేశంలో పేదవాళ్లు ఎప్పుడు ప్రశ్నిస్తారంటూ రాహుల్ ట్వీట్

Rahul Gandh
Rahul Gandh

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బియ్యంతో శానిటైజర్లు తయారుచేస్తున్నారంటూ వస్తున్న కథనాలపై ఓవైపు పేదవాళ్లు ఆకలితో చచ్చిపోతుటే, బియ్యంతో శానిటైజర్లు తయారుచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. ‘భారతదేశంలో పేదవాళ్లు ఎప్పుడు మేల్కొంటారు? ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు? ‘ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీరు ఆకలితో అలమటిస్తుంటే, మీకు దక్కాల్సిన బియ్యంతో శానిటైజర్లు తయారుచేసి సంపన్నుల చేతులు శుభ్రపరచాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు’ అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/