చైనా వెలుపల మరో వ్యక్తి మృతి

హాంకాంగ్‌లో తాజాగా కరోనా సోకి తొలి వ్యక్తి దుర్మరణం

First coronavirus death in hongkong
First coronavirus death in hongkong

హాంకాంగ్‌: ప్రపంచ వ్యాప్తంగా చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌కు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే ఈ వైరస్‌ చైనా నుంచి 20 దేశాలకు వ్యాపించింది. ఆయా దేశాల్లో కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే. చైనాలో ఇప్పటికే సుమారుగా 450 మంది ఈ వైరస్‌ కారణంగా మరణించారు. అయితే చైనా వెలుపల, ఇతర దేశాలలో కూడా దీని కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం నమోదైంది తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు తాజాగా హాంకాంగ్‌లో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందాడు. 39 ఏళ్ల వయసున్న ఓ వక్తి గత నెలలో చైనాలోని వూహాన్ కు వెళ్లారు. జనవరి 23న హాంకాంగ్ కు తిరిగొచ్చాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల్లో ఆయనకు కారోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్ లో మరో 15 కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/