కరోనా ఎఫెక్ట్‌: బంతిపై లాలాజలం ఉపయోగించం

టీమ్‌ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చిస్తాం: భువనేశ్వర్‌ కుమార్‌

Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar

ధర్మశాల: న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయం తర్వాత టీమిండియా తిరిగి తన ఫాంను సంపాదించుకోవాలని చూస్తుంది. దక్షిణాఫ్రికా తో జరిగే వన్డే సిరీస్‌లో తిరిగి పూర్వ వైభవం రప్పించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. అయితే ఈ సందర్భంలోనే టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఓ సంచలన వ్యాఖ్య చేశాడు. కరోనా ప్రభావం భారతదేశంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బంతిపై లాలాజలం ఉపయోగించమని భువీ అన్నాడు. భువనేశ్వర్ మాట్లాడుతూ… ‘మేము ఈ విషయం (లాలాజలం వాడాలా వద్దా)పై ఆలోచిస్తున్నాం. లాలాజలం ఉపయోగించనని కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే లాలాజలం ఉపయోగించకపోతే బంతిని షైన్ చేయలేం. అలా చేయకపోతే మేము సరిగా రాణించలేం. అప్పుడు సరిగా బౌలింగ్ చేయలేదని అభిమానులు మాపై విమర్శలు చేస్తారు’ అని అన్నాడు. ‘ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజు టీమ్ మీటింగ్ ఉంది. అందులో ఈ విషయంపై చర్చిస్తాం. తుది నిర్ణయం మాత్రం జట్టు వైద్యుడు తీసుకుంటాడు. అతను మాకు ఏ సలహా ఇస్తాడో చూడాలి’ అని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/