అప్పుడు ఫ్లిప్‌ ఫ్లాప్‌ చెప్పులు..ఇప్పుడు ప్యూమా క్రికెట్‌ షూలు

దశాబ్దం ముగింపులో తీసుకున్న ఫొటోనూ పోస్ట్ చేసిన కోహ్లీ

Virat Kohli
Virat Kohli

ముంబయి: గడచిన దశాబ్దం ప్రారంభంలో (10 ఏళ్ల క్రితం) తాము తీసుకున్న ఫొటోలను కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా అప్పటి, ఇప్పటి ఫొటోలు పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పట్లో ఫ్లిప్ ఫ్లాప్ చెప్పులతో, ఇప్పుడు ప్యూమా క్రికెట్ షూలతో ఉన్నానని ఆయన ట్వీట్ చేశాడు. చేతుల్లో చెప్పులు పట్టుకొని 10 ఏళ్ల క్రితం ఓ జలపాతం వద్ద దిగిన ఫొటోను ఆయన షేర్ చేశాడు. తాజాగా కుడి చేతిలో ప్యూమా షూలు పట్టుకొని దిగిన మరో ఫొటోను పోస్ట్ చేశాడు. ‘దశాబ్దం ప్రారంభంలో, దశాబ్దం ముగింపు’లో అని ఆయన ఈ ఫొటోలకు క్యాప్షన్ పెట్టాడు. విరాట్ కోహ్లీని ప్యూమా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. ఇక భారత టెస్టు కెప్టెన్లలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సారథిగా కోహ్లీ నిలిచాడు. పరుగుల వరద పారిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/