ఐపీఎల్ క్రీడాభిమానులకు శుభ ‘వార్త’
25 శాతం మేర ప్రేక్షకులకు అనుమతి

ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త తెలిపింది. ఐపీఎల్ నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వంతో బుధవారం బీసీసీఐ చర్చలు నిర్వహించింది. ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో 25 శాతం ఆక్యుపెన్సీతో ప్రేక్షకుల అనుమతికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీసీసీఐ కూడా ఐపీఎల్ నిర్వహకులకు మైదానంలో 25 శాతం సామర్థ్యంతో ప్రేక్షకుల అనుమతి ఇచ్చింది. కరోనా పరిస్థితులను బట్టి ప్రేక్షకుల సామర్థ్యం పెంచుతామని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం, బీసీసీఐ వెల్లండించాయి. మార్చి 26 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/