కరోనా భయం: ఫ్యాన్స్‌తో నో సెల్ఫీ

No fan interactions’, ‘selfies. IND vs SA matches
No fan interactions’, ‘selfies. IND vs SA matches

ఢిల్లీ: భారత్‌తో దక్షిణాఫ్రికా వన్డేల సిరీస్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు ఢిల్లీకి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) భారత్‌లోనూ విస్తరిస్తుండడంతో దక్షిణాఫ్రికా జట్టు తమ వెంట వైద్యుడిని తెచ్చుకుంది. సఫారీ జట్టు వెంట క్రికెట్‌ సౌతాఫ్రికా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ షుయబ్‌ మన్‌జ్రా కూడా ఉన్నారు. అయితే కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న నేపథ్యంలో భారత్‌ సిరీస్‌ సమయంలో తమ ఆటగాళ్లెవరూ కరచానాలు చేయరని ప్రోటీస్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దక్షణాఫ్రికా జట్టు యాజమాన్యం తమ ఆటగాళ్లకు కొన్ని జాగ్రత్తలు సూచించినట్లు సమాచారం.’విదేశాలకు వెళ్లేటప్పుడు ఆటగాళ్లకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించాం. అలానే భారత్‌కు వెళ్లేప్పుడు కూడా చెప్పాం. ఇవి ఆటగాళ్లకే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని ఇప్పటికే ఆటగాళ్లకు సూచించాం’ అని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్య వర్గాలు తెలిపాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/