ఆసీస్ 61/2

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ 

Austrakua 61-2
Austrakua 61-2

Brisbane: భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ -గవాస్కర్ సిరీస్ లో భాగంగా శుక్రవారం మొదలైన నాలుగో చివరి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఆసీస్ కేవలం 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 4 పరుగుల వద్ద కేవలం 1 పరుగు చేసిన డేవిడ్ వార్నర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు.

జట్టు స్కోరు 17 పరుగుల వద్ద మార్కస్ హారిస్ (5)శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత స్మిత్, లుబుస్ చేంజ్ లు జాగ్రత్తగా ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లోొ 23 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా రెండు వికట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/