మయాంక్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించేది పృథ్వీషానే
అశ్విన్ వరల్డ్‌క్లాస్ బౌలర్ ఆ విషయంలో సందేహం లేదు

ముంబయి: న్యూజిలాండ్ గడ్డపై తొలి టెస్ట్‌లో ఘోరపరాజయాన్ని చవిచూసిన భారత్ రెండో టెస్టుకు సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
ముఖ్యంగా రెండు ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన పృథ్వీషాకు అవకాశం దక్కుతుందా? లేక శుభ్‌మన్ గిల్ అరంగేట్రం చేయనున్నాడా? అనే అంశంపై తీవ్ర చర్చజరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సమధానమిచ్చారు. రెండో టెస్టు సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మయాంక్‌తో ఓపెనర్ బరిలోకి దిగేది పృథ్వీషానేనని రవిశ్రాస్తి స్పష్టం చేశారు. షా గాయం నేపథ్యంలో గిల్ ఆరంగేట్రం ఉంటుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. షా సిద్ధంగా ఉన్నాడు. మయాంక్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించేది అతనే. గిల్‌కు అవకాశం లేదని శాస్త్రి చెప్పుకొచ్చారు. ఇక అశ్విన్, జడేజాలలో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై శనివారం పిచ్ పరిస్థితి చూశాక నిర్ణయం తసుకుంటామని తెలిపారు. అశ్విన్ వరల్డ్ క్లాస్ బౌలర్ ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితులకు తగ్గట్టు ఎవరిని ఆడించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతను తన సత్తా ఎంటో నిరూపించుకుంటాడు అని శాస్త్రి తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/