నెల్లూరులో తొలి కరోనా కేసు నమోదు

Coronavirus first case in nellore
Coronavirus first case in nellore

నెల్లూరు: ఏపిలోని నెల్లూరు జిల్లాలో తొలి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కేసు నమోదైంది. 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఓ యువకుడిని పరీక్షించిన అనంతరం వైద్యులు అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడు నెల్లూరు చిన్న బజారుకు చెందిన వ్యక్తి. అతడు కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్యులు పుణె పంపగా ఈ విషయం తేలింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరులో పలు కార్యక్రమాలను వాయిదా వేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/