స్కూల్స్ పున: ప్రారంభం-44 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

తల్లిదండ్రుల ఆందోళన – స్కూల్స్ తెర‌వ‌డంపై పునరాలోచ‌న చేయాల‌ని డిమాండ్

Students in class room
Students in class room

Amaravati: ఎపిలో ఈ నెల 2 నుంచి స్కూల్స్ పునః ప్రారంభ‌మ‌య్యాయి.. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది..

ఈ నేప‌థ్యంలో వివిధ జిల్లాలో నేటి వ‌ర‌కూ 44 క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి..

ప్రారంభ‌మైన తొలి రోజునే ప్ర‌కాశం జిల్లాలోని మోడ‌ల్ స్కూల్లో ముగ్గురు విద్యార్ధుల‌తో స‌హా ఒక ఉపాధ్యాయిని క‌రోనా బారీన ప‌డింది.

ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ఎడవల్లిలో 10 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా సోకింది.

విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 చదువుతున్న 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పరీక్షలు చేయడంతో అంద‌రికి పాజిటివ్ వచ్చింది.

ఈ జిల్లాలోనే ముగ్గురు సిబ్బందికి సైతం కరోనా సోకినట్లు సమాచారం  దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

స్కూల్స్ తెర‌వ‌డంపై పునరాలోచ‌న చేయాల‌ని డిమాండ్ విన్పిస్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/