వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో వ్యాక్సిన్‌

Health Minister Dr Harsh Vardhan

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ఈరోజు ఢిల్లీలో జ‌రిగిన ఐసీఎంఆర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ‌చ్చే ఏడాది తొలి త్రైమాసికంలో క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం దేశంలో మూడు ర‌కాల టీకాల‌కు మాన‌వ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కోవిడ్‌19 వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ను కూడా ప్రారంభించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ పోర్ట‌ల్‌కు వెళ్లితే.. ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతున్న టీకా ట్ర‌య‌ల్స్ స‌మాచారం మొత్తం ల‌భ్య‌మ‌వుతుంద‌న్నారు. ఐసీఎంఆర్‌కు ఇవాళ చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు అని, ఐసీఎంఆర్ వందేళ్ల టైమ్‌లైన్‌ను రిలీజ్ చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌ల సేవ‌లు అనిర్వ‌చ‌నీయ‌మ‌న్నారు. భావి త‌రాల శాస్త్ర‌వేత్త‌ల‌కు ఐసీఎంఆర్ ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని మంత్రి తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/