బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా
మూడో పరీక్షలో పాజిటివ్

బ్రెజిల్ లో కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రత అధికంగా ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కరోనా బారిన పడ్డారు.
ఆయనకు గతంలో రెండు సార్లు చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా, మూడో పరీక్షలో పాజిటివ్ అని తేలింది. బ్రెజిల్ లో ఇప్పటికే కరోనా వ్యాప్తి సామాజిక సంక్రమణం దశలో ప్రమాదకర స్థాయికి చేరింది.
అమెరికా తర్వాత ప్రపంచంలో బ్రెజిల్ లోనే అత్యధిక కేసులున్నాయి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/