మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

ఆగిఉన్న ట్రైన్‌ రెండు కోచ్‌లకు మంటలు

Fire at Moulali railway station

Hyderabad: మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అగి ఉన్న ట్రైన్‌కు చెందిన రెండు కోచ్‌లకు మంటలు అంటుకున్నాయి. 

భారీగా ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఆర్పారు.  ఈ ప్రమాదంలో ఒక బోగి దాదాపు మంటల్లో కాలిపోయింది. 

మరో బోగీకి మంటలు వ్యాపించేలోపే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలకు కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/