అనుపమ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా

స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడి

Anupam Kher family
Anupam Kher family

Mumbai: ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

తొలుత తన తల్లి దులారీకి కరోనా సోకిందని, ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడు తుండటంతో పరీక్షలు చేయించామని చెప్పారు.

కరోనా పాజిటివ్ అని తేలగానే కుటుంబ సభ్యులందరం పరీక్షలు చేయించుకున్నామని చెప్పారు.

తన సోదరుడు, మరదలు, మేనకోడలుకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని అనుపమ్ ఖేర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/