సోనియాజీ తెలంగాణను కాపాడండి

వీడియో కాల్‌లో కోమటిరెడ్డి వినతి

Komatireddy video call to sonia gandhi
Komatireddy video call to sonia gandhi

Hyderabad: సీఎం కేసీఆర్‌ చేతిలో తెలంగాణ విలవిల్లాడుతోంది..మీరే రాష్ట్రాన్ని కాపాడాలి   అంటూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సోనియాగాంధీని కోరారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సోనియా గాంధీతో వీడియో కాల్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘ 4 కోట్ల ప్రజల చిరకాల కోరికను మీరే నిజం చేశారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలు చూడలేక తెలంగాణ రాష్ట్రాన్ని మీరే ఇచ్చారు.

మిగులు బ్జడెట్‌తో మీరు ఇచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల పాలు చేశారు.   కరోనా విషయంలో నిమ్మకు నిరెత్తనట్టు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మీరు ఇచ్చిన తెలంగాణ కేసీఆర్‌ చేతిలో విలవిల్లాడుతోంది. మీరే తెలంగాణను కాపాడాలి’  అంటూ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సోనియా గాంధీని కోరారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/