ఆంధ్రప్రదేశ్ కు లక్ష ర్యాపిడ్ కిట్లు

పది నిముషాల్లోనే కరోనా టెస్ట్ ఫలితం

CM YS Jagan Launching Corona Kits

Amaravati: ఆంధ్రప్రదేశ్ కు లక్ష ర్యాపిడ్ కిట్లు వచ్చాయి. ఈ కిట్లు దక్షిణ కొరియా నుంచి వచ్చాయి. సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానం ద్వారా ఈ కిట్లు రాష్ట్రానికి చేరుకున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీటిని ప్రారంభించారు.

ఈ కిట్ల ద్వారా పది నిముషాలలోనే కరోనా పాజిటివ్ లేదా నెగటివ్ అన్న విషయం తేలిపోతుంది.

వీటిని కమ్యూనిటీ టెస్టింగ్ కోసం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. 

వీటిని నాలుగైదు రోజులలో అన్ని జిల్లాలకూ పంపిస్తామని వారు పేర్కొన్నారు.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ  కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ,  సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/