సూర్యాపేట జిల్లాలో 44 కు చేరిన కరోనా కేసులు
అప్రమత్తమైన అధికారులు

సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. నిన్న ఒక్కరోజులోనే 16 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 కు చేరుకుంది. దీంతో అప్రమత్తమమైన అధికారులు వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే చేస్తు అనుమానితులను గుర్తిస్తున్నారు. అంతేకాకా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వారి స్వాప్ నమూనాలు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపుతున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలలో భయాందోళనలు పెరిగాయి. జిల్లాలో మరింత కఠిన చర్యలకు పూనుకుంటున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/