పాక్ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిదీనే కి కరోనా పాజిటివ్

త్వరగా కోలుకోవటానికి అందరి ఆశీస్సులు కావాలంటూ ట్వీట్

Corona Positive to Shahid Afridine
Shahid Afridine

Islamabad: పాకిస్థాన్ డాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీనే కరోనా బారినపడ్డాడు. అత‌డికి వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.

కరోనా సోకిన తొలి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అఫ్రిదీనే. తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని అఫ్రిదీనే వెల్లడించాడు.

“గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఒళ్లంతా ఒకటే నొప్పులు. వైద్య పరీక్షలు చేస్తే దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్ అని వచ్చింది.

త్వరగా కోలుకునేందుకు అల్లా దయ, మీ ఆశీస్సులు కావాలని కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/