తమిళనాడులో మళ్లీ లాక్ డౌన్ ?!

ప్రభుత్వం నిర్ణయం

Intense Lockdown
Intense Lockdown

Chennai: కరోనా కట్టడి చర్యలలో భాగంగా తమిళనాడులో మరోమారు లాక్ డౌన్ విధించనున్నారు. అయితే ఈ సారి రాష్ట్రం మొత్తం కాకుండా కరోనా వ్యప్తి ఉధృతంగా ఉన్న నాలుగు  జిల్లాలలో కంప్లీట్ లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నెల 19 నుంచి 30 వరకూ గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాలలో లాక్ డౌన్ విధించనున్నారు. 

 లాక్‌డౌన్ సమయంలో ఆటోలు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. ఎమర్జెన్సీ ఐతే తప్ప ప్రైవేట్ వాహనాలను అనుమతించరు.

లాక్‌డౌన్ విధిస్తున్న ఈ నాలుగు జిల్లాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని   సర్కారు నిర్ణయించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/