ఢిల్లీలో బయటపడ్డ క‌రోనా కొత్త వేరియంట్

దేశ రాజధాని ఢిల్లీ లో క‌రోనా కొత్త వేరియంట్ బయటపడింది. తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్య‌క్తిలో ఓమిక్రాన్ BA.2.12.1 వేరింయంట్ ను అధికారులు గుర్తించారు. ఈ వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌మ‌ని … ఓమిక్రాన్ BA.2 వేరియంట్ క‌న్నా.. ఈ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని అధికారులు తెలిపారు. ఈ BA.2.12.1 వేరియంట్ వ‌ల్లే ప్ర‌పంచంలో ఎక్కువ కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని హెచ్చరించారు.

ఈ కొత్త‌ వేరియంట్ వెలుగు చూడ‌కముందు.. ఢిల్లీలో సింగిల్ డిజిట్ లోనే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యేవి. కానీ ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద‌ల నుంచి క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ తో దేశ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. గత 24 గంటల్లో ఢిల్లీ లో కొత్తగా 1,009 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 5.7 శాతానికి పెరిగింది. అయితే ఎలాంటి భయాందోళన అవసరం లేదని ఆప్‌ ప్రభుత్వం తెలిపింది. తగినన్ని బెడ్లను ఆసుపత్రుల్లో సిద్ధం చేసినట్లు పేర్కొంది.