దేవుల‌ప‌ల్లి ప్రభాకర్ రావు మృతి..సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్ర‌భుత్వ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు దేవుల‌ప‌ల్లి ప్ర‌భాక‌ర్ రావు (84) కన్నుమూశారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప్ర‌భాక‌ర్ రావు హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. దేవుల‌ప‌ల్లి మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. 2016, ఏప్రిల్ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ అధికార భాషా సంఘం చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు.

దేవుల‌ప‌ల్లి మృతి ప‌ట్ల తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంతాపం ప్ర‌క‌టించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా దేవులపల్లి ప్రభాకర్ రావు గారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులుగా అందించిన సేవలను ఎర్ర‌బెల్లి కొనియాడారు.